‘రణరంగం’ నుంచి కాజల్ సాంగ్…

0
2
‘రణరంగం’ నుంచి కాజల్ సాంగ్…

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….

  • సుధీర్ వర్మ నుంచి ‘రణరంగం’…
  • నాయికలుగా కాజల్ – కల్యాణి ప్రియదర్శన్ …
  • ఆగస్టు 15వ తేదీన విడుదల…

                          వివరాల్లోకి వెళితే… సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా .. కాజల్ అగర్వాల్ నాయికగా ‘రణరంగం’ రూపొందింది. మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు.’పిల్లా పిక్చర్ పెర్ఫెక్ట్’ అంటూ సాగే ఈ పాటను కాజల్ పై చిత్రీకరించారు. జోరుగా .. హుషారుగా ఈ పాట సాగుతోంది. సన్నీ సంగీతం .. నిఖిత గాంధీ ఆలాపన కొత్తగా వున్నాయి. ఈ సినిమాలో మాఫియా డాన్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే శర్వానంద్ కోరిక ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి.