కాలా జామూన్‌…..

0
7
కాలా జామూన్‌…..
కావలసిన పదార్థాలు  :
  • కోవా – 400 గ్రా.
  • పనీర్‌ – 125 గ్రా.
  • బొంబాయి రవ్వ – ఒక టేబుల్‌ స్పూను.
  • బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను.
  • వేగించడానికి నూనె – సరిపడా.
  • మైదా – అరకప్పు.
  • పంచదార – ఒక కేజీ.
  • నీరు – అర లీటరు.
నింపడానికి:  జీడిపప్పు, బాదం – 7 చొప్పున, యాలకుల పొడి – అర టీ స్పూను, పంచదార – ఒక టేబుల్‌ స్పూను, ఫుడ్‌ కలర్‌ – అర చిటికెడు.
తయారుచేసే విధానం: వెడల్పాటి పళ్లెంలో పనీర్‌ చిదిమి అందులో రవ్వ, బేకింగ్‌ సోడా, మైదా, కోవా వేసి చేత్తో బాగా కలిపి ముద్దగా చేసి పక్కనుంచాలి. ఇప్పుడు ఒక లోతైన పాత్రలో పంచదార, నీరు పోసి పాకం కోసం స్టవ్‌ మీద ఉంచాలి. ఈలోపు ఒక గిన్నెలో చిరంజీ, బాదం, జీడిపప్పుల తురుము, స్పూను పంచదార, ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడితో పాటు టేబుల్‌ స్పూను కోవా మిశ్రమం  అన్నీ బాగా కలపాలి. పంచదార తీగపాకం రాగానే మంట తీసేయాలి. మరో బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు కోవా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగాతీసుకుని వడల్లా చేత్తో ఒత్తి మధ్యలో పావు టీ స్పూను డ్రైఫ్రూట్‌ మిశ్రమం పెట్టి ఉండలా చుట్టాలి. ఈ ఉండలన్నీ నూనెలో దోరగా చిన్నమంటపై వేగించి పంచదార పాకంలో వేసి కనీసం 3 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత అరగంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేసుకుంటే బాగుంటాయి  .
                                                                                                          డెస్క్:వాసవి