కాళేశ్వరం పనులు పూర్తి….

0
3
కాళేశ్వరం పనులు పూర్తి….

హైదరాబాద్ న్యూస్ డేట్: కాళేశ్వరం భూగర్భ సొరంగం పనులను టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. చీకటి గుహలోకి చకచకాదిగిన యువనేత, అధికారులకు ముందస్తు సమాచారం లేకుండానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తన నియోజకవర్గంలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ కోనరావ ు పేట మండలం మల్కపేటలో నిర్మి స్తున్న రిజర్వాయర్‌ పనులను, అండర్‌ టన్నెల్‌ పనులను పరిశీలించాలని నిర్ణయించారు. అండర్‌టన్నెల్‌ లోకి దిగి ఎంతవరకు పనులు పూర్తయ్యా యో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దార్శనికతకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్నారు. సీఎం కేసీఆర్‌ పట్టుదల, నీటిపారుదల శాఖలోని అనుభవజ్ఞులైన నిపుణుల సహకారంతో 90శాతం పనులు పూర్తయ్యాయని, ఆగస్టు సెప్టెంబర్‌ నాటికి మొత్తం పనులు పూర్తవుతా యని ఆయన అన్నారు. ప్రాజెక్టు పూర్తయితే సిరిసిల్ల జిల్లాలోని 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here