కమల్ సర్.. సినీరంగానికి మీ సహకారం అసాధారణం ………

0
1
కమల్ సర్.. సినీరంగానికి మీ సహకారం అసాధారణం ………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 
  • సినీ రంగంలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న మీకు శుభాకాంక్షలు
  • ఇది నిజంగా చాలా స్ఫూర్తివంతం 

సినీనటుడు కమలహాసన్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 60 సంవత్సరాలు పూర్తయ్యాయి. అంతేగాక, ఈ రోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘కమలహాసన్ సర్… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీరంగానికి మీరందించిన సహకారం అసాధారణం. అలాగే, సినీ రంగంలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటోన్న మీకు శుభాకాంక్షలు.. ఇది నిజంగా చాలా స్ఫూర్తివంతమైన విషయం. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.  కాగా, క‌మ‌ల్ ప్రస్తుతం శంక‌ర్ దర్శకత్వంలో ‘ఇండియ‌న్ 2’లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ సహా ఇతర భాషల్లోనూ విడుదల చేస్తారు. ఇందులో ఆయనకు జోడీగా కాజల్ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు .