ఆర్టీసీని ప్రైవేటు పరం చేయనున్న కర్ణాటక సర్కారు!

0
2
ఆర్టీసీని ప్రైవేటు పరం చేయనున్న కర్ణాటక సర్కారు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • పీకల్లోతు కష్టాల్లో కర్ణాటక ఆర్టీసీ
  • మరో 23 సంస్థలు కూడా నష్టాల్లోనే
  • వదిలించుకునేందుకు ప్రభుత్వం సమాయత్తం

ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ప్రతిపాదనను యడ్యూరప్ప సర్కారు పరిశీలిస్తోంది. ఇప్పటికే అధికారుల నివేదికలపై చర్చలు జరుగుతున్నాయి. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించుకున్న కర్ణాటక ప్రభుత్వం అందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. నాలుగు భాగాలుగా ఉన్న ఆర్టీసీతో పాటు మరో 23 ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నష్టాల్లో ఉన్నాయని తేల్చిన అధికారులు, వాటన్నింటినీ వదిలించుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.