టీ20ల్లో కోహ్లీ మరో ఘనత.. రోహిత్ రికార్డు బద్దలు……..

0
6
టీ20ల్లో కోహ్లీ మరో ఘనత.. రోహిత్ రికార్డు బద్దలు……..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • టీ20ల్లో అత్యధిక పరుగుల వీరుడిగా కోహ్లీ…
  • రోహిత్‌ను రెండో స్థానంలోకి నెట్టేసిన కెప్టెన్…
  • 71 మ్యాచుల్లోనే ఘనత…

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 52 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 72 పరుగులు చేసిన కోహ్లీ.. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ రికార్డును బద్దలుగొట్టాడు.2,434 పరుగులతో రోహిత్ ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా, నిన్నటి మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన కోహ్లీ 2,441 పరుగులతో ఆ రికార్డును బద్దలుగొట్టి రోహిత్‌ను కిందికి నెట్టేశాడు. రోహిత్ 97 మ్యాచుల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 71 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. ఇక, ఈ జాబితాలో కోహ్లీ, రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (2,283), షోయబ్ మాలిక్ (2,263), బ్రెండన్ మెకల్లమ్ (2,140)లు టాప్-5లో కొనసాగుతున్నారు.