కోహ్లీ, రవిశాస్త్రి ఈసారి తప్పించుకోలేరు!

0
5
కోహ్లీ, రవిశాస్త్రి ఈసారి తప్పించుకోలేరు!
(టిన్యూస్10):న్యూస్‌టుడే:  
  • వరల్డ్ కప్ సెమీస్ లో భారత్ కు ఓటమి
  • వరల్డ్ కప్ కోసం కోహ్లీ, శాస్త్రిలకు స్వేచ్ఛనిచ్చిన బోర్డు
  • కివీస్ చేతిలో ఓటమితో బీసీసీఐ అసంతృప్తి
                       వివరాల్లోకి వెళితే….ఇప్పటివరకు టీమిండియాలో విరాట్ కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాటగా సాగిందనడంలో ఎలాంటి సందేహంలేదు. టీమిండియాకు చెందిన ప్రతి అంశంలోనూ కోహ్లీ ప్రమేయం ఉంది.  జట్టు ఎంపికలో కోహ్లీ అభిప్రాయానికే  ఇచ్చేవాళ్లన్నది బహిరంగ రహస్యం. అయితే ఇది నిన్నటివరకే. ప్రపంచకప్ సెమీస్ లో భారత్ ఓటమి అనంతరం జట్టులోని లోపాలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి. వ్యూహాత్మక తప్పిదాలతో పాటు, జట్టు ఎంపిక కూడా అసంబద్ధంగా ఉందని బీసీసీఐ పాలకవర్గం భావిస్తోంది. ఇప్పటివరకు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బీసీసీఐ పెద్దగా స్పందించలేదు. ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని వారిద్దరికీ స్వేచ్ఛనిచ్చింది. కానీ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ వంటి జట్టు చేతిలో ఓటమి బీసీసీఐని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. కోహ్లీ, రవిశాస్త్రిల నిర్ణయాలను ఇప్పటికీ ప్రశ్నించకుండా ఉంటే అది సరైన విధానం అనిపించుకోదని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.