సమస్యలను పరిష్కరిస్తాము అంటున్న…కలెక్టర్ కోన శశిధర్…

0
4
సమస్యలను పరిష్కరిస్తాము అంటున్న…కలెక్టర్ కోన శశిధర్…
గుంటూరు:  న్యూస్‌టుడే:
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరు..
*చదువుని ఎట్టి పరిస్థితిల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని కోరుట….
భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 128 వ రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు ఆదివారం గుంటూరు నగరం మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్ మాట్లాడుతూ నాతోపాడు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని, వేదికపై మాట్లాడే అవకశం ఇచ్చారని అన్నారు. దళిత సంఘాల నాయకులు ప్రస్తావించిన సమస్యలను ఎన్నికల ప్రక్రియ ముగిశాక పరిష్కరిస్తామని చెప్పారు. చదువుని ఎట్టి పరిస్థితిల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని కోరారు. విశ్రాంత చేయవద్దని కోరారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకర్ పేదలకు చేసీ సేవలు ఇతర ఐఏఎస్‌లు చేత లేదన్నారు.
                                                                                                           డెస్క్:దుర్గ