లతా మంగేష్కర్ పై చెక్కుచెదరని అభిమానం… ఇదే నిదర్శనం!

0
9
లతా మంగేష్కర్ పై చెక్కుచెదరని అభిమానం… ఇదే నిదర్శనం!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న లత
  • తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభం
  • రెండ్రోజుల్లో 56 వేలమంది ఫాలోవర్లు

గానకోకిల లతా మంగేష్కర్ వృద్ధాప్యంలో ఉన్నా కానీ అభిమానుల్లో ఆమెపై ఇసుమంత కూడా ఆపేక్ష తగ్గలేదు. అందుకు ఇదే నిదర్శనం. లతా మంగేష్కర్ సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగిస్తుంటారన్నది తెలిసిందే. ఇప్పటివరకు ట్విట్టర్ లో ఎంతో చురుగ్గా ఉన్న ఆమె తాజాగా ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లోనూ అడుగుపెట్టారు. ఖాతా తెరిచారో లేదో రెండ్రోజుల్లోనే ఆమెను 56 వేల మంది అభిమానులు అనుసరించడం మొదలుపెట్టారు. సెప్టెంబరు 28 తన పుట్టినరోజు నాడు ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంతో అరుదైన ఓ ఫొటో పోస్టు చేశారు. అందులో లతా మంగేష్కర్ సోదరీమణులు ఉన్నారు.