పాలకూర, పండుమిర్చి పచ్చడి…..

0
2
పాలకూర, పండుమిర్చి పచ్చడి…..

 కావాల్సిన పదార్ధాలు:

  • పాలకూర తరుగు 3 కప్పులు
  • పండు మిరపకాయలు 6
  • చింతపండు చిన్న నిమ్మకాయంత
  • జీలకర్ర 1 టీస్పూన్
  • ధనియాలు 2 టీస్పూన్లు
  • పసుపు 1/4 టీస్పూన్
  • ఉప్పు తగినంత
  • ఆవాలు, జీలకర్ర 4 టీస్పూన్లు
  • కరివేపాకు 2 రెబ్బలు
  • నూనె 4 టీస్పూన్

తయారు చేయు విధానం:
పాలకూర ఆకులు కడిగి ఆరబెట్టాలి. పండుమిర్చి తొడిమలు తరగాలి లేదా ముద్దలా చేసుకోవాలి. 
కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి జీలకర్ర, ధనియాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
అందులోనే పాలకూర, పండుమిర్చి గింజలు, నార తీసిన చింతపండు రెక్కలు వేసి కలిపి మగ్గనివ్వాలి. పూర్తిగా మెత్తబడ్డాక దింపి చల్లార్చాలి
అందులోనే పాలకూర మిశ్రమం వేసి మెత్తబడ్డాక దింపి చల్లారనివ్వాలి. 
ముందుగా జీలకర్ర, ధనియాల పొడి చేచసుకుని పాలకూర మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మెత్తగా రబ్బుకోవాలి
గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి  ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పటలాడాక వేసి దింపి పచ్చడిలో వేసి కలపాలి.