భూటాన్ లో విరాట్ కోహ్లీ దంపతులను గుర్తుపట్టని స్థానికులు!

0
1
భూటాన్ లో విరాట్ కోహ్లీ దంపతులను గుర్తుపట్టని స్థానికులు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • భూటాన్ లో పర్యటిస్తున్న విరుష్క జోడి
  • ట్రెక్కర్స్ అనుకుని ఇంటికి పిలిచి టీ ఆఫర్ చేసిన స్థానికులు
  • ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన అనుష్క

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ… ఈ పేర్లకు పరిచయం అక్కర్లేదు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్, ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనుష్క జంట ప్రస్తుతం ఆట నుంచి, సినిమాల నుంచి విరామం తీసుకుని భూటాన్ లో పర్యటిస్తున్నారు. అక్కడి మంచు కొండలు, పర్వతాల్లో పర్యటిస్తూ సేదదీరుతున్నారు.అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడి స్థానికులు ఈ జంటను గుర్తు పట్టలేదు. ఎవరో ట్రెక్కింగ్ కోసం వచ్చారని భావించి, వారికి టీ ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో స్వయంగా వెల్లడించిన అనుష్క, ఇలా సెలబ్రిటీ స్టేటస్ ను వదిలేసి తిరగడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని అనుష్క పేర్కొంది. తమను గుర్తించని ఓ అందమైన కుటుంబాన్ని చూశామని, వారి ఆతిథ్యం ఎంతో నచ్చిందని, కాసేపు వారితో మాట్లాడి, వారిచ్చిన టీ తాగామని చెప్పుకొచ్చింది.ఇక అనుష్క పెట్టిన పోస్ట్ ను చూసిన పలువురు సెలబ్రిటీలు, తాము కూడా ఇటువంటి అనుభూతినే కోరుకుంటున్నట్టు చెప్పడం గమనార్హం. ఆయుష్మాన్ ఖురానా, సమంత, అనితా షరాఫ్, మనీశ్ మల్ హోత్రా, శ్రద్ధా కపూర్ తదితరులు స్పందిస్తూ, ఇంత సాధారణ క్షణాలు మధురానుభూతులను మిగులుస్తాయని వ్యాఖ్యానించారు.