ప్రేమతో పిలిస్తే పలికే సాయి…

0
5
ప్రేమతో పిలిస్తే పలికే సాయి…

బాబా దయతో ‘సాయీ నామస్మరణ భాగ్యం లభించింది మనకు. ఈ విశ్వంలో సాయికి సమానమైన పదం, భాష, భావం మరొకటి లేవు. ఆ పిలుపొక్కటి చాలు. భవసాగరాన్ని తరింపచేయటానికి మానవ జన్మను భూమ్మీదే సార్ధకం చేయగల పావన నామం ‘ శ్రీ సాయి ‘.  
 శ్రీ సాయిబాబా అరవై ఏళ్ల పాటు షిరిడిలోనే ఉండి తన బోధనలతో మానవాళికి మంచి జీవన విధానాన్ని అలవర్చడానికి కృషిచేశారు. 
 బాబా వేషధారణ చిత్రంగా ఉండేది. పొడవాటి కఫనీ (లాల్చీ) వేసుకునేవారు. తలకొక గుడ్డ (పాగా) చుట్టుకునే వారు. 
నిత్యం ‘అల్లామాలిక్’ (దేవుడే సర్వాధికారి) అంటుండేవారు. షిరిడీలోని పాడుబడిన మసీదు బాబా నివాసమైంది. ఈ కారణంగా బాబాను ముస్లిం అని కొందరు భావించేవారు.    
 బాబా తనుండే మసీదును ‘ద్వారకామాయీ అని పిలిచేవారు. అక్కడికి దగ్గర్లో తులసి మొక్కలు  నాటి, నీళ్ళుపోసి పెంచేవారు. నిత్యం మసీదు గోడల నిండా దీపాలను వెలిగించి అలంకరించేవారు. ఈ కారణంగా కొందరు బాబాని హిందువని అనుకునేవారు. 
అన్ని మతాల వారు  బాబాను ఆశ్రయించేవారు. బాబా జీవించిన కాలంలో  హిందూ – ముస్లింల మధ్య వైషమ్యాలు తీవ్రంగా ఉండేవి. రెండు మతాల మధ్య సామరస్వాన్ని కుదిర్చారు. ఒకేరోజు షిరిడీ ప్రజల చేత ఉరుసు ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు చేయించి దైవమొక్కటే అని చాటారు. అందరి అభిమతాన్ని తీర్చడమే కదా దైవం సంకల్పం!