భారీ చారిత్రక చిత్రం కోసం థాయ్ లాండ్ కి మణిరత్నం టీమ్

0
0
భారీ చారిత్రక చిత్రం కోసం థాయ్ లాండ్ కి మణిరత్నం టీమ్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • భారీ చారిత్రక చిత్రంగా ‘పొన్నియిన్ సెల్వన్’
  • డిసెంబర్ 2వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • థాయ్ లాండ్ లో తొలి షెడ్యూల్   

                               వివరాల్లోకి వెళితే…సామాజిక పరిస్థితులు .. కట్టుబాట్లు .. ఆ రెండింటితో పెనవేసుకున్న ప్రేమకథలతో మణిరత్నం సినిమాలు తెరకెక్కుతూ ఉంటాయి. వాస్తవానికి దగ్గరగా కథలు .. సహజత్వానికి చేరువగా పాత్రలు మసలుకుంటూ ఉంటాయి గనుకనే ఆయన చిత్రాలు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంటాయి. అలాంటి మణిరత్నం ఈ సారి చారిత్రక నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. చోళరాజుల కాలంనాటి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. తమిళంలో ఈ సినిమాకి ‘పొన్నియిన్ సెల్వన్’ అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. విక్రమ్ .. జయం రవి .. కార్తీ .. మోహన్ బాబు .. ఐశ్వర్య రాయ్ .. కీర్తి సురేశ్ వంటి తారలను ఇప్పటికే ఎంపిక చేేశారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో ప్లాన్ చేశారు. డిసెంబర్ 2వ వారం నుంచి అక్కడ రెగ్యులర్  షూటింగ్ మొదలు కానుంది. షూటింగుకు వారం ముందుగానే ఈ సినిమా టీమ్ అక్కడికి చేరుకోనుంది.