‘మన్మథుడు 2’ విడుదల తేదీ ఖరారు…………..

0
6
‘మన్మథుడు 2’ విడుదల తేదీ ఖరారు…………..

(టిన్యూస్10):న్యూస్‌టుడే: 

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ‘మన్మథుడు 2’
  • నాయికలుగా రకుల్ – కీర్తి సురేశ్
  • ఆగస్టు 9వ తేదీన విడుదల   

                     వివరాల్లోకి వెళితే….నాగార్జున కథానాయకుడిగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ రూపొందింది. రకుల్ ప్రీత్ – కీర్తి సురేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నాగార్జున సొంత బ్యానర్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషించింది. వెన్నెల కిషోర్ .. ఐశ్వర్య గౌడ ముఖ్యమైన పాత్రల్లో  కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ‘మన్మథుడు’ స్థాయిలో ‘మన్మథుడు 2’ కూడా నాగార్జునకి హిట్ తెచ్చిపెడుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.