మన్మథుడు 2’ తో రీ ఎంట్రీ…..

0
13
మన్మథుడు 2’ తో రీ ఎంట్రీ…..

ఇటీవల తెలుగులో ఆఫర్లు లేక కోలీవుడ్‌కు వెళ్లి అక్కడ బిజీ అయింది హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. కార్తీ నటించిన ‘ఖాకి’ చిత్రం ద్వారా అక్కడ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్‌ను పెంచేసింది రకుల్. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం సూర్య సరసన ‘ఎన్‌జికె’, శివ కార్తికేయన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల ఆమె కార్తీతో ‘దేవ్’ అనే సినిమా చేసింది.ఈ సినిమా ఆశించిన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. అయినా కూడా తన పారితోషికాన్ని తగ్గించుకోకుండా మరికొంత పెంచేసిందట ఈ భామ. ‘దేవ్’ వరకు కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్న రకుల్ ఇటీవల తెలుగులో నాగార్జునకు జోడీగా ‘మన్మథుడు 2’ అనే చిత్రానికి సైన్ చేసింది. ఈ చిత్రానికి గాను ఒక కోటి యాభై లక్షల వరకు పారితోషికాన్ని తీసుకుంటోందని తెలిసింది. ఈ సినిమా తర్వాత రకుల్ మళ్లీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి.

                                                                                                                డెస్క్:జ్యోతి.