మ‌రో ఛాన్స్….

0
3
మ‌రో ఛాన్స్….

న్యూస్ టూడే:తమిళంలో బిజీగా ఉన్న కేథరిన్‌ థెరిస్సా దక్షిణాది ఇతర భాషల సినీరంగాలను అడపాదడపా చుట్టేస్తోంది. తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసిన ఈ భామకు ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు..నేనే మంత్రి చిత్రాల్లోని పాత్రలు బాగా గుర్తింపునిచ్చాయి. జయ జానకి నాయక చిత్రంలో ఎ ఫర్‌ ఆపిల్‌ అంటూ ప్రత్యేక గీతంలో నర్తించి ఆ రకంగా ప్రేక్షకులను అలరింపజేసింది. టాలీవుడ్‌లో ఎప్పుడు అవకాశాలు వచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్న కేథరిన్‌కు ఇప్పుడు ఒకటికి రెండు అవకాశాలు లభించాయని అంటున్నారు. రవితేజ కథానాయకుడిగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ చిత్రానికి తెరవెనుక సన్నాహాలు జరుగుతున్నాయని కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఇందులో కేథరిన్‌ను కథానాయికగా ఎంపిక చేశారన్నది కూడా ఆ వార్తలలో ఒక అంశంగా తెలిసింది. ఇదిలావుండగా…తాజాగా విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్‌ నెం.46గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇప్పటికే రాశిఖన్నా, ఐశ్వర్యరాజేష్‌, ఇజబెల్లా కథానాయికలుగా ఎంపిక కాగా ఇంకో హీరోయిన్‌గా కేథరిన్‌ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. దసరా సందర్భంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. గోపీసుందర్‌ సంగీతాన్ని, జేకే సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here