మేనల్లుడికి మెగా సర్టిఫికేట్!

0
5
మేనల్లుడికి మెగా సర్టిఫికేట్!

        సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘చిత్రలహరి’ ఏప్రిల్ 12 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తండ్రికొడుకుల అనుబంధం చక్కగా చూపించారని.. యువతకు మంచి మెసేజ్ ఉందని తెలిపారు చిరంజీవి.  జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా..ఓటమి బారిన పడినా మన లక్ష్యం కోసం కష్టపడుతూ ధైర్యంగా ముందుకెళ్తే ఏదైనా సాధించగలమని ఈ సినిమాలో చూపించారు. ఇలాంటి మంచి మెసేజ్ తో దర్శకుడు కిషోర్ తిరుమల చిత్రలహరి ని చక్కగా తీర్చిదిద్దారని..  సాయి తేజ్ కూడా మెచ్యూరిటీ తో కూడిన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని తెలిపారు.  ఈ సినిమాలో పోసాని.. సునీల్ పాత్రలు కూడా చక్కగా కుదిరాయని అన్నారు. దేవీ శ్రీప్రసాద్ మరో సారి తన పాటలతో.. నేపథ్య సంగీతంతో సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడని అన్నారు.  నిర్మాతలు నవీన్.. రవి శంకర్.. మోహన్ మరోసారి తమ బ్యానర్ ఇమేజ్ తగ్గకుండా మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారని మెచ్చుకున్నారు. 

 

                                                                                                                       డెస్క్:లక్ష్మీ