‘ఐటీ గ్రిడ్స్‌’లో మరిన్ని ఆధారాల సేకరణ…

0
7
‘ఐటీ గ్రిడ్స్‌’లో మరిన్ని ఆధారాల సేకరణ…

హైదరాబాద్‌: ఓటర్ల తొలగింపు, డేటా చౌర్యం కేసులో విచారణను వేగవంతం చేసేందుకు ఏర్పాటైన ‘సిట్‌’ బృందం శనివారం మాదాపూర్‌లోని ‘ఐటీ గ్రిడ్స్‌’ కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. ‘సిట్‌’ అధికారి స్టీఫెన్‌రవీంద్ర, సభ్యులు రోహిణి ప్రియదర్శిని, శ్వేతారెడ్డిల బృందం ఉదయం నుంచి రాత్రి వరకూ దశలవారీగా కార్యాలయంలో రికార్డులను పరిశీలించింది. సైబరాబాద్‌ పోలీసులు అప్పగించిన ఆధారాలను సిట్‌ సభ్యులు సరిపోల్చుకున్నారు. ఇంకా ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ‘సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌’ చేశామని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ‘ఐటీ గ్రిడ్స్‌’ సంచాలకుడు అశోక్‌ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వాదనను వినిపించనున్నామన్నారు.  ఇకపై గోషామహల్‌లోని సిట్‌ కార్యాలయం నుంచి దర్యాప్తు కొనసాగనుందని పేర్కొన్నారు. మరోవైపు ‘ఐటీ గ్రిడ్స్‌’పై ఎస్సార్‌నగర్‌లో నమోదైన కేసును ‘సిట్‌’కు బదిలీ చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు.