సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం………

0
3
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • అల్లు అర్జున్ సినిమాలో బాలీవుడ్ నటి 
  • పంజాబ్ లో భారీ ఎత్తున ‘సాహో’
  • సోనాల్ తో బాలకృష్ణ పాట

*  ప్రస్తుతం తాను త్రివిక్రమ్ తో చేస్తున్న ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని దిల్ రాజు బ్యానర్లో చేయనున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహించే ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు బాలీవుడ్ నటి దిశా పథానిని తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయంలో సంప్రదింపులు జరుగుతున్నాయి.
*  ‘బాహుబలి’ చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రభాస్ పేరు తెచ్చుకోవడంతో అతను నటించిన తాజా చిత్రం ‘సాహో’కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా సాహోను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్రంలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల అవుతోంది.
*  బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కోసం ఓ పాట చిత్రీకరణను ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్ జంటపై ఈ పాటను వచ్చే వారంలో చిత్రీకరిస్తారు.