సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం…….

0
5
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం…….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • గెస్ట్ పాత్రకు ఓకే చెప్పిన రెజీనా
  • ముంబైలో ‘దర్బార్’ చివరి షెడ్యూల్ 
  • మళ్లీ పోలీస్ పాత్రలో వెంకటేశ్

*  కథానాయిక రెజీనా తాజాగా గెస్ట్ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందట. విశాల్ హీరోగా నటిస్తూ ‘ఇరింబు తిరై’ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుండగా, రెజీనా గెస్ట్ పాత్ర చేస్తుందట.
 *  మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘దర్బార్’ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. రజనీ సహా ప్రధాన తారాగణం పాల్గొనే సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
*  ప్రస్తుతం ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో వెంకటేశ్ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించారు. ‘నేను లోకల్’ ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే ఈ చిత్రంలో వెంకటేశ్ పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తారని తెలుస్తోంది.