సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం………..

0
3
సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం………..

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……..

  • రవితేజ సరసన మళ్లీ రాశిఖన్నా
  • విజయశాంతిపై సోలో దృశ్యాల చిత్రీకరణ 
  • బరువు పెంచుతున్న కంగన

*  రవితేజతో రాశిఖన్నా మళ్లీ జోడీ కట్టే అవకాశం వుంది. ‘ఆర్.ఎక్స్ 100’ ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘మహా సముద్రం’ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాశిఖన్నాను సంప్రదిస్తున్నారట. గతంలో వీరిద్దరూ కలసి ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాలలో జంటగా నటించారు.
*  మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ప్రస్తుతం కీలక పాత్రధారి విజయశాంతిపై సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా ‘తలైవి’ చిత్రం రూపొందుతోంది. ఇందులో జయలలిత పాత్రలో నటిస్తున్న కంగన రనౌత్ ఈ పాత్ర పోషణ కోసం ప్రత్యేక శద్ధ తీసుకుంటోంది. ఇప్పటికే తమిళం నేర్చుకుంటున్న కంగన, ప్రస్తుతం బరువు పెరిగే పనిలో కూడా వుందట. దాదాపు పది కిలోల బరువు పెరగడానికి ప్రయత్నిస్తోందని సమాచారం.