అదేమీ హిందూ, ముస్లిం గొడవ కాదు… నటుడి ‘దీపావళి’ పోస్ట్ పై ముంబై పోలీసులు!

0
3
అదేమీ హిందూ, ముస్లిం గొడవ కాదు… నటుడి ‘దీపావళి’ పోస్ట్ పై ముంబై పోలీసులు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • పండగను అడ్డుకున్నారని విశ్వభాను పోస్ట్
  • వైరల్ కావడంతో విచారణ జరిపిన పోలీసులు
  • రెండు కుటుంబాల మధ్య రాజీ

తాను ఓ ముస్లిం కాలనీలో ఉంటున్నానని, తన కుటుంబం దీపావళి పండుగ జరుపుకోకుండా తన పొరుగింటి ముస్లింలు అడ్డుకున్నారని హిందీ టీవీ నటుడు విశ్వభాను తన ఫేస్ బుక్ ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ కావడంతో పోలీసులు స్పందించి, విషయాన్ని ఆరా తీశారు. అక్కడి ప్రజలు తన భార్యతో వాదనకు దిగారని, లైట్లు వెలగనివ్వలేదని, ముగ్గులు కూడా వేసుకోనివ్వలేదని విశ్వభాను ఆరోపించిన సంగతి తెలిసిందే.దీనిపై విచారణ జరిపిన మల్వానీ పోలీసు స్టేషన్ అధికారి జగదేవ్ కలపాడ్ మీడియాకు వివరాలు అందించారు. ఇదేమీ హిందూ – ముస్లిం గొడవ కాదన్నారు. విశ్వభాను అలంకరించిన లైట్ల కారణంగా ఓ పిల్లాడికి షాక్ తగిలిందని, లైట్లు ఎత్తులో పెట్టాలని కొందరు కోరడంతోనే ఘర్షణ జరిగిందని అన్నారు. అదే ప్రాంతంలో ఎంతో మంది హిందువులు ఉన్నారని, వారంతా ఏ ఇబ్బందీ లేకుండా దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకున్నారని చెప్పారు. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చామని, ప్రస్తుతం వివాదమేమీ లేదని స్పష్టం చేశారు.