‘బాహుబలి 2’లో అలా అవకాశం వచ్చింది: ఆశ్రిత వేముగంటి

0
9
‘బాహుబలి 2’లో అలా అవకాశం వచ్చింది: ఆశ్రిత వేముగంటి

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • హైదరాబాదులో పుట్టిపెరిగాను 
  • మొదటి నుంచి భరతనాట్యంపై ఆసక్తి ఎక్కువ 
  • విశ్వనాథ్ గారి సినిమాలు ఇష్టమన్న ఆశ్రిత  

                                   వివరాల్లోకి వెళితే… ‘బాహుబలి 2’ సినిమాలో ‘కన్నా నిదురించరా ..’ పాటలో అనుష్కతో పాటు డాన్స్ చేసిన యువతిపై అందరి చూపులు నిలిచిపోయాయి. ఆమె ఎవరా అనే సెర్చింగ్ లో ఆశ్రిత వేముగంటి .. భరత నాట్య కళాకారిణి అనే విషయం వెలుగుచూసింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. “నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. కాలేజ్ వయసు నుంచి భరతనాట్యంపై మరింత ఫోకస్ పెట్టాను. చిన్నప్పటి నుంచి విశ్వనాథ్ గారి సినిమాలు ఎక్కువగా చూసేదానిని. అలాంటి నాకు ఆయన ‘విశ్వనాథామృతం’ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావించాను. ‘అంతకుముందు ఆ తరువాత’ అనే సినిమా ఆడియో వేడుకలో స్టేజ్ పై నాట్య ప్రదర్శన ఇచ్చాను. అక్కడే రాజమౌళి గారు నన్ను చూశారు. ఆ తరువాత ఒక నెలకి ఆయన నుంచి నాకు కబురు వచ్చింది. ‘బాహుబలి 2’లో ‘కన్నా నిదురించరా’ అనే పాటలో చేసే అవకాశం అలా వచ్చింది” అని ఆమె చెప్పుకొచ్చారు.