వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ నుంచి కొత్త పోస్టర్

0
6
వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ నుంచి కొత్త పోస్టర్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • వరుస హిట్స్ తో వరుణ్ తేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ 
  • డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

                                        వివరాల్లోకి వెళితే…వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ తెచ్చిన ఉత్సాహంతో వరుణ్ తేజ్ మరో ప్రాజెక్టుతో రంగంలోకి దిగుతున్నాడు. వరుణ్ తేజ్ కి ఇది 10వ సినిమా. కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా ఈ సినిమా రూపొందనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను వదిలారు. బాక్సింగ్ పంచ్ కి సంబంధించిన పోస్టర్ ను వరుణ్ తేజ్ అధికారిక ఇన్స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందనే విషయంలో స్పష్టతను ఇచ్చాడు  సిద్ధు ముద్ద – అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి, అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమా, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.