నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం!

0
7
నాగార్జున ఇంటిని ముట్టడిస్తాం!

(టిన్యూస్10)న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…. 

  • కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ 3 పై విచారణ చేపట్టాలి… 
  •  రియాలిటీ షో బిగ్ బాస్ కి నాగార్జున హోస్టింగ్ చేయడాన్ని తప్పు పడుతున్న విద్యార్థులు… 

                           వివరాల్లోకి వెళితే…..కింగ్ నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ – 3 రకరకాల వివాదాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. యాంకర్ కం జర్నలిస్ట్ శ్వేతారెడ్డి- నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వేధింపుల ప్రహసనంపై విచారించాల్సిందిగా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. అటుపై టాలీవుడ్ నిర్మాత.. రాజకీయ నాయకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ 3 పై విచారణ చేపట్టాలంటూ కోర్టుల పరిధిలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసి పోరాడేందుకు సిద్ధమవ్వడంతో ఇప్పటికే ఈ సీజన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈసారి బిగ్ బాస్ కొత్త సీజన్ ఉంటుందా ఉండదా? అన్న డైలెమా  నెలకొంది.తాజాగా బిగ్ బాస్ షో వేధింపుల వ్యవహారాన్ని నిరసిస్తూ ఆ షోని నిలిపేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్శిటీ విద్యయార్థులు ఆందోళన బాట పట్టడం సంచలనమైంది.