తమ్ముడితో రహస్యంగా మంతనాలు జరిపిన నళిని!

0
3
తమ్ముడితో రహస్యంగా మంతనాలు జరిపిన నళిని!

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నాలుగు రోజుల క్రితం పెరోల్ పై విడుదలైన నళిని…
  • నిత్యమూ పోలీసు స్టేషన్ లో సంతకం…
  • తమ్ముడు భాగ్యనాథన్ తో పెళ్లి ఏర్పాట్లపై చర్చలు…

                                         వివరాల్లోకి వెళితే….రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా నిరూపితమై, వేలూరు జైల్లో 28 ఏళ్లకు పైగా శిక్షను అనుభవిస్తూ, కుమార్తె వివాహం నిమిత్తం 30 రోజుల పెరోల్ పై వచ్చిన నళిని, తన తమ్ముడిని కలిసి ఏకాంత ప్రదేశంలో రహస్యంగా మాట్లాడారు. నిత్యమూ వేలూరులోని సత్ వచ్చారి పోలీసు స్టేషన్ లో సంతకం పెట్టాల్సిన ఆమె, ఆదివారం నాడు స్టేషన్ కు వచ్చి సంతకాలు పెట్టారు.ఆపై తనను చూసేందుకు వచ్చిన తమ్ముడు భాగ్యనాథన్ తో ఇంటికి వెళ్లి, కుమార్తె హరిద్ర వివాహ ఏర్పాట్లపై మాట్లాడారు. నళినిని కలిసేందుకు వీసీకే పార్టీకి చెందిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విన్నయ అరసు నళిని ఇంటికి వచ్చినా, కోర్టు అనుమతి లేనిదే మాట్లాడేందుకు, కలిసేందుకు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వెనక్కు వెళ్లిపోయారు.