నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

0
16
నేడు గుంటూరు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11.45 గంటలకు గురజాలలో నిర్వహించే ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు సత్తెనపల్లిలో ప్రచార సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు తాడికొండలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.