ఐపీఎల్ లో కొత్త అంపైర్… ‘నోబాల్స్’ గమనించేందుకు!

0
1
ఐపీఎల్ లో కొత్త అంపైర్… ‘నోబాల్స్’ గమనించేందుకు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • నోబాల్స్ గుర్తించకపోవడంతో గతంలో విమర్శలు
  • కొత్త నిర్ణయం తీసుకున్న గవర్నింగ్ కౌన్సిల్
  • పవర్ ప్లేయర్ నిబంధన ప్రస్తుతానికి పక్కనే!

క్రికెట్ మ్యాచ్ లో ఇద్దరు ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, రిజర్వ్ అంపైర్ ఉంటారన్న సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్‌ లో తొలిసారి నోబాల్స్ ను మాత్రమే పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ అంపైర్‌ రానున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ, ఎంఐ మధ్య జరిగిన మ్యాచ్ లో నోబాల్స్ ను గుర్తించని సందర్భంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలను నివారించేందుకే ఈ సరికొత్త ఆలోచన చేసినట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెల్లడించింది. త్వరలో జరిగే ముస్తాక్ అలీ దేశవాళీ టీ-20లో నోబాల్ అంపైర్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని కూడా నిర్ణయించారు.ఇక మ్యాచ్ లో పవర్ ప్లేయర్ ను తీసుకురావాలన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నుంచి అనుమతి లభించలేదని సమాచారం. వచ్చే సంవత్సరం సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్ కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించాలని, 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ అదనంగా రూ. 3 కోట్ల వరకూ ఖర్చు పెట్టుకోవచ్చని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.