‘నిశ్శబ్దం’ నుంచి అనుష్క ఫస్టులుక్ పోస్టర్……….

0
6
‘నిశ్శబ్దం’ నుంచి అనుష్క ఫస్టులుక్ పోస్టర్……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • హేమంత్ మధుకర్ నుంచి ‘నిశ్శబ్దం’
  • చిత్రకారిణి పాత్రలో అనుష్క 
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు

అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘నిశ్శబ్దం’ సినిమా రూపొందుతోంది. కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా దాదాపు విదేశాల్లోనే జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి అనుష్క ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.’సాక్షి’ అనే ఒక చిత్రకారిణిగా ఈ పోస్టర్లో ఆమె కనిపిస్తోంది. అనుష్క లుక్ డిఫరెంట్ గా వుంది. విభిన్నమైన కంటెంట్ కావడంతో, అంతా ఈ సినిమా పట్ల ఆసక్తిని చూపుతున్నారు. మాధవన్ .. మైఖేల్ మాడిసన్ .. అంజలి .. షాలినీ పాండే .. సుబ్బరాజు ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. టైటిల్ .. ఈ తరహా చిత్రాల విషయంలో అనుష్కకి గల క్రేజ్ ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.