విమానంలో నితిన్ గడ్కరీ… పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు!

0
5
విమానంలో నితిన్ గడ్కరీ… పైలట్ అప్రమత్తతతో తప్పిన ముప్పు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • నాగపూర్ నుంచి ఢిల్లీకి విమానం
  • సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్
  • ప్రయాణికులు క్షేమమేనని ప్రకటించిన ఎయిర్ పోర్ట్

కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే, నాగపూర్ నుంచి న్యూఢిల్లీకి ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం (6ఈ 636) టేకాఫ్ కు సిద్ధమవుతున్న వేళ, సాంకేతికలోపం తలెత్తినట్టు పైలట్ కు అర్థమైంది. వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి తెలిపిన పైలట్, విమానం టేకాఫ్ ను నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించారు. ఆ సమయంలో విమానంలో గడ్కరీ సహా 143 మంది ఉన్నారని, విమానంలో టెక్నికల్ సమస్య ఏర్పడిందని ఇండిగో యాజమాన్యం ధ్రువీకరించింది. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపామని, ప్రయాణీకులందరూ సురక్షితమేనని నాగపూర్‌ ఎయిర్ పోర్టు సీనియర్‌ డైరెక్టర్‌ విజయ్‌ మూలేకర్‌ మీడియాకు వెల్లడించారు.