నితిన్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్… డెస్క్:దుర్గ

0
7
నితిన్ కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్…         డెస్క్:దుర్గ

(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు… 

  • నితిన్ తాజా చిత్రంగా ‘భీష్మ’
  • తదుపరి సినిమాగా ‘రంగ్ దే’
  • లైన్లో చంద్రశేఖర్ యేలేటి

                        వివరాలోకి వెళితే…కథల ఎంపిక విషయంలో తాను చేసిన పొరపాట్ల కారణంగానే తనకి పరాజయాలు ఎదురవుతున్నాయని భావించిన నితిన్, కొంత గ్యాప్ తీసుకుని మరీ మూడు ప్రాజెక్టులను ఓకే చేశాడు. ఆ మూడింటిలో ముందుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ జోడీగా రష్మిక నటిస్తోంది. 
మరో సినిమాను నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ సినిమాకి ‘రంగ్ దే’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కోసం కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకున్నారు. వచ్చే వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక చంద్రశేఖర్ యేలేటిని కూడా నితిన్ లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.