నువ్వుల ఆవకూర రైస్…

0
4
 నువ్వుల ఆవకూర రైస్

 తయారీకి కావాల్సనవి :

 • తెల్ల నువ్వులు – అర కప్పు
 • ఆవకూర తరుగు – ఒక కప్పు
 • సోయాకూర తరుగు – ఒక కప్పు
 • చీల్లీ పెక్స్ – ఒక స్పూన్
 • ఉడికించిన రెడ్ రైస్ ఒక కప్పు
 • తేనే 2 స్పూన్స్
 • కొత్తిమీర – కొద్దిగా
 • ఆవనూనె – తగినంత 
 • వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్
 • లవంగాలు – 4
 • అల్లం ముక్కలు – 2 స్పూన్స్
 • ఉల్లి కాడ తరుగు కొద్దిగా
 • ఉప్పు – తగినంత
 • చింతపండు రసం – 2 స్పూన్స్.

తయారీ విధానం : ముందుగా ఆవానునె వేసి వేడెక్కిన తరువాత లవంగాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లికాడ వేసి వేయించుకోవాలి. తరువాత నువ్వులు, ఆవాకూర తరుగు, సోయాకూర తరుగు వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. తరువాత చింతపండు రసం , ఉప్పు, చీల్లీ పెక్స్ వేసి మగ్గనివ్వాలి. తరువాత రెడ్ రైస్, తేనె వేసి కొంచెం సేపు మగ్గిన తరువాత దంచుకొవాలి. కొత్తిమీరతో గార్నీష్ చెసుకోవాలి. దీనివల్ల పైబర్, ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ చాలా బాగా అందుతాయి. ఈ రెసిపి షుగర్ ఉన్న వారికి చాలా మంచిది.                                                                          డెస్క్ ….. లక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here