ఆస్తుల విషయంలో అభిప్రాయ బేధాలు .. క్షమించి వదిలేసిన వాణిశ్రీ

0
0
ఆస్తుల విషయంలో అభిప్రాయ బేధాలు .. క్షమించి వదిలేసిన వాణిశ్రీ

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • వాణిశ్రీ గారితో సాన్నిహిత్యం ఎక్కువ 
  •  అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చేవారు
  • ఆ సమస్య కోర్టువరకూ వెళ్లిందన్న ఈశ్వర్

                                   వివరాల్లోకివెళితే…సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ .. వాణిశ్రీ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. “వాణిశ్రీ గారితో నాకు సాన్నిహిత్యం ఎక్కువ. నేను ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా ఆమె కాదనేవారు కాదు. అలా ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఆమె ఆధ్యాత్మికపరమైన .. వేదాంత పరమైన ధోరణిలో మాట్లాడారు. ‘ఎవరూ శాశ్వతం కాదు .. ఏదీ మనతో  రాదు’ అనే తరహాలో ఆమె మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ తరువాత నాకు తెలిసింది .. ఆస్తుల విషయంలో కుటుంబ సభ్యులతోనే ఆమెకి అభిప్రాయ బేధాలు వచ్చాయని. అప్పట్లో ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది. ఆ తరువాత అంతా రాజీ కొచ్చేసి సర్దుకుపోయారు. వాణిశ్రీలో వచ్చిన ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు .. వేదాంతపరమైన ధోరణి కారణంగానే ఆమె మనసు మార్చుకున్నారనే విషయం నాకు అర్థమైంది. ఏదేవైనా ఆమె సమస్య పరిష్కారమైనందుకు నాకు కూడా సంతోషం కలిగింది” అని చెప్పుకొచ్చారు.