మన ఆచారాలు సంప్రదాయాలు…… దీపారాధన ఎలా చెయ్యాలి..?

0
9
మన ఆచారాలు సంప్రదాయాలు…… దీపారాధన ఎలా చెయ్యాలి..
దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపరాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి  స్థిరనివాసం   చేస్తుందని, దీపంలేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మిస్థానం అవుతాయని చెప్పారు. దీపారాధన లేకుండా దేవతారాధన చెయ్యరు. దీపం సకల దేవతా స్వరూపం. దీపం వెలిగించే కుంది భాగం బ్రహ్మ, మధ్య భాగం విష్ణుమూర్తి, ప్రమిద శివుడు, కుందిలో వేసే వత్తి బిందువు, వత్తినుంచి వచ్చే అగ్ని శక్తి, ఆ అగ్ని తాలూకు వెలుగు సరస్వతీ, విస్ఫులింగం లక్ష్మీదేవి. …దీపారాధనలో వెండి కుందులు  విశిష్టమైనవి. పంచలోహ కుందులు, మట్టి కుందులది తర్వాతి స్థానం.  దీపారాధన స్టీలు కుందిలో చేయకూడదు. కుంది కింద చిన్న పళ్లెం పెట్టాలి. మట్టిప్రమిద అయితే కింద మరో ప్రమిదను తప్పనిసరిగా పెట్టాలి.

                                                                                                                డెస్క్:దుర్గ