పాకిస్తాన్.. యూ టర్న్ …మరోసారి మోసానికి…

0
4
పాకిస్తాన్.. యూ టర్న్ …మరోసారి మోసానికి…

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి మోసానికి తెగబడింది. దుర్మార్గపు చర్యకు పూనుకుంది. 26/11 నాటి ముంబై దాడులకు సూత్రధారి హఫీజ్ సయీద్ కు చెందిన జమాత్-ఉద్-దవాతో పాటు ఫలా-ఇ-ఇన్సానియత్ ఉగ్రవాద సంస్థలను నిషేధించినట్లు ఇదివరకు ప్రకటించిన పాకిస్తాన్.. యూ టర్న్ తీసుకుంది. ఈ రెండు సంస్థలపై నిషేధాన్ని విధించలేదు. వాటిపై నిఘా మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి.. పాకిస్తాన్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉన్న జాతీయ ఉగ్రవాద వ్యతిరేక అథారిటీ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలో క్రియాశీలకంగా ఉన్న 68 ఉగ్రవాద సంబంధ సంస్థలపై నిషేధాన్ని విధించినట్లు పాకిస్తాన్ ఈ ప్రకటనలో వెల్లడించింది. జమాత్-ఉద్-దవాతో పాటు ఫల-ఇ-ఇన్సానియత్ లపై నిఘా మాత్రమే ఉంచినట్లు పేర్కొంది.