ప్లాట్ లో గుర్తించలేని మృతదేహం…

0
2
ప్లాట్ లో గుర్తించలేని మృతదేహం…

భోపాల్ న్యూస్ టూడే: మద్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని బీడిఎ కాంప్లెక్స్ లోగల ఒక ప్లాట్ లో మృతదేహం లభ్య మవడంతో స్థానికంగా కలకలం చెలరేగింది .ఆ మృతదేహాన్ని ఆరేడు నెలలు క్రితమే ఒక రగ్గులో చుట్టి,చెక్క దీవాన్లో ఉంచి పైన దుస్తువులతో నింపేసి ఆదీవాన్ కు తాళం వేశారని తెలుస్తోంది ఈ ప్లాట్ బ్రజ్ మోహన్ శ్రీవాస్తవ్ కు చెందినది, ప్లాట్ లో శ్రీవాస్తవ్ కుమారుడు అమిత్ (31) ఉంటున్నారు, అయితే ఆయన కూడా సుమారు ఆరేడు నెలలు గా కనిపించడంలేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు, కాగా ప్రస్తుత ప్లాట్ ఓనర్. నెహ్రూనగర్ నివాసి రామ్ వీర్ సింగ్ కుమారుడు తన బంధువు ధర్మేంద్ర సింగ్ తో ఈ ప్లాట్ కు వచ్చినప్పుడు ఈ వ్యవహారం వెలుగు చూసింది వారు ప్లాట్ తాళం తీయగానే లోపలి నుంచి దుర్వాసన వచ్చింది .హాలులోని దీవాన్ ను తేరవగానే ఒక మహిళ మృతదేహం కనిపించింది, దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఈ సందర్భంగా రాం వీర్ సింగ్ మాట్లాడుతూ తాను 2018 జూన్ 2న ఈ ప్లాట్ కొనుగోలు చేసే నిమిత్తం రిజిస్ట్రేషన్ చేయించారని, కొంత డబ్బులు చెల్లించానని అన్నారు ఈనేపద్యంలోనే తాను ప్లాట్ మోహన్ శ్రీవాస్తవ్ భార్య విమల పేరున ఉండగా, వారి కుమారుడు విక్రయించాడు,కాగా దీవాన్ లో లభ్యమైన మృతదేహం విమలదే అయివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

                                                                                                        డెస్క్:కోటి & సాయి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here