పనిచేయని 102కు పైగా ఈవీఎం

0
7
పనిచేయని 102కు పైగా ఈవీఎం

అమరావతి న్యూస్‌టుడే:      ఏపీలో లోక్‌సభ, అసెంబ్లి స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. దీంతో పలు చోట్ల పోలింగ్‌ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కాగా, మరికొన్ని చోట్ల పోలింగ్‌కు అంతరాయం కలుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 102కు పైగా ఈవీఎంలు పని చేయడం లేదు. ఈవీఎంలు పని చేయక పోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.