పవన్ కొత్త ప్లాన్..

0
2
పవన్ కొత్త ప్లాన్..

న్యూస్ టూడే:పార్టీ కమిటీల్లో చోటు కోసం జనసైనికులంతా ఎదురు చూస్తుంటే.. ఉరుములేని పిడుగులా ఏకంగా అసెంబ్లీ టికెట్ల కోసం ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించడం మొదలుపెట్టారు జనసేనాని. దీనికోసం స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి మరీ వడపోత షురూచేశారు. స్క్రీనింగ్ కమిటీలో మాదాసు గంగాధరం, అరహం ఖాన్, హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శివశంకర్.. ఇలా ఐదుగురు సభ్యులుంటారు.వీరంతా టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. పవన్ కల్యాణ్ సూచించిన 4 క్వాలిటీలు వారిలో ఉన్నాయో లేదో చూస్తారు. ఉంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంపై నివేదికలిస్తారు. అభ్యర్థి వ్యక్తిగత బలం, పోరాట పటిమ, గెలిచే సమర్థత, సామాజిక అంశాలపై స్పందన, నిబద్ధత.. ఇలా కొలమానాలున్నాయి. వీటిని చూస్తుంటే.. ఈ లెక్కలన్నీ తయారుచేసింది పవన్ కల్యాణే అని ఈజీగా తెలిసిపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here