కేసీఆర్ ను కడిగేసే దమ్ము పవన్ కు మాత్రమే ఉందా?

0
5
కేసీఆర్ ను కడిగేసే దమ్ము పవన్ కు మాత్రమే ఉందా?

న్యూస్‌టుడే:

కేసీఆర్ వ్యూహంలో నేతలు చిక్కుకోవటమే కానీ.. ఆయన్ను తమ వ్యూహంలో పడేలా చేసిన తెలివి ఏ నేతకు లేదని చెప్పాలి. అది చంద్రబాబు కావొచ్చు.. వైఎస్ జగన్ కావొచ్చు.. మరెవరైనా కావొచ్చు. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కొత్త తరహా అనుభవాన్ని తెలుగు ప్రజలకు పంచుతున్న ఏకైక నేతగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చెప్పాలి.మోడీ.. కేసీఆర్.. చంద్రబాబు.. జగన్ ఇలా వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరినైనా సరే ఉతికి ఆరేయటం.. వారిని తన మాటలతో ఆత్మరక్షణలో పడేలా చేయటంలో పవన్ కు మించినోడు లేడని చెప్పాలి. ప్రతి పార్టీ అధినేతకు కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకు మినహాయింపుగా ఇప్పటివరకూ కేసీఆర్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆయనతో పాటు.. ఆ స్థానాన్ని సొంతం చేసుకున్న అధినేతగా జనసేనానిని చెప్పుకోవాలి.                                                                డెస్క్:లక్ష్మీ