రేపు జనసేన అధినేత పవన్‌ పర్యటన…

0
7
రేపు జనసేన అధినేత పవన్‌ పర్యటన…

నరసరావుపేట  న్యూస్‌టుడే:

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ నెల 5వ తేదీ మంగళవారం నరసరావుపేటలో పర్యటిస్తారని ఆ పార్టీ నియోజకవర్గ నేత సయ్యద్‌ జిలానీ అన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినుకొండ రోడ్డులోని జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఓవర్‌ బ్రిడ్జి, మల్లమ్మ సెంటర్‌, శివుడు బొమ్మ సెంటర్ల మీదుగా పల్నాడు రోడ్డు వరకు రోడ్‌ షో, ర్యాలీ జరుగుతుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు పల్నాడు రోడ్డులో జరిగే బహిరంగ సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగిస్తారని చెప్పారు. అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జనసేన నాయకులు రామిశెట్టి సుబ్బారావు, గద్దె తిరుపతిరావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీఎస్‌ ప్రసాదు, డి.రమాదేవి, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు

                                                                                                                   డెస్క్:దుర్గ