పీలేరు బరి వారసులు గురి

0
3
పీలేరు బరి వారసులు గురి

చిత్తూరు న్యూస్‌టుడే:ముఖ్యంశాలు:

  • పోటీ పంచముఖమైనా పోరు రెండు పార్టీల మధ్యే..వాయల్పాడు నియోజకవర్గంలో తొలుత కమ్యూనిస్టులు…
  • తరువాత కాంగ్రెస్‌ పార్టీలకు అనుకూలం.
  • తెదేపా ఆవిర్భావంతో 1983లో, 1985 మధ్యంతర ఎన్నికల్లో చల్లా ప్రభాకరరెడ్డి, 1994లో జీవీ శ్రీనాథరెడ్డి తెదేపా ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.
  • కాంగ్రెస్‌ తరఫున 1989, 99, 2004లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.
  • పునర్విభజన తరువాత పీలేరు నియోజకవర్గం ఏర్పడ్డాక 2009లో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, 2014లో చింతల రామచంద్రారెడ్డి వైకాపా ఎమ్మెల్యేగా గెలుపొందారు.
  • 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో మూడు పర్యాయాలు తెదేపాకు, నాలుగు పర్యాయాలు కాంగ్రెస్‌కు, ఒక పర్యాయం వైకాపాకు ఓటర్లు పట్టం కట్టారు. 2014 లో జరిగిన ఎన్నికలకు ఇప్పటికీ రాజకీయ సమీకరణలు ఎంతగానో మారాయి. పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలకడ, కంభంవారిపల్లె మండలాలున్నాయి. ఇక్కడ పోటీ చేస్తున్న తెదేపా, వైకాపా అభ్యర్థులు తండ్రి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చారు. మిగిలిన వారు ఈదఫా కొత్తగా బరిలో దిగారు. స్వతంత్రులతో కలుపుకొని మొత్తం 14మంది పోటీలో ఉన్నా ప్రధానపోటీ మాత్రం తెదేపా, వైకాపా అభ్యర్థుల మధ్యనే నెలకొంది.                                                                                                                      డెస్క్:వసుధ