పోలింగ్‌ కేంద్రాల వ్యక్తిగత సంక్షేమం…

0
3
పోలింగ్‌ కేంద్రాల వ్యక్తిగత సంక్షేమం…

ఒంగోలు , న్యూస్‌టుడే:

సార్వత్రిక ఎన్నికల్లో నగదు, మద్యం నియంత్రణకు జిల్లా స్థాయిలో పలు కమిటీలు నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఉత్తర్వులు జారీ చేశారుప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, ఓటు సద్వినియోగం చేసుకునేలా చైతన్య పరచడం, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు వీరు చర్యలు తీసుకుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారాలపై పర్యవేక్షణ, ఈవీఎం, వీవీప్యాట్స్‌ భద్రత, గోదామలకు తరలింపు, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అన్ని విధాలా పర్యవేక్షించేలా 23 కమిటీలను కలెక్టర్‌ నియమించారు. మ్యాన్‌ పవర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి నోడల్‌ అధికారిగా ప్రత్యేక ఉప కలెక్టర్‌ వి.ఆర్‌.చంద్రమౌళి వ్యవహరిస్తారు.పీడబ్ల్యూడీ ఓటర్ల పర్యవేక్షణ కమిటీ… జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ బత్తిన సింగయ్య. పోలింగ్‌ కేంద్రాల వ్యక్తిగత సంక్షేమం… ప్రత్యేక ఉప కలెక్టర్‌ వి.ఆర్‌.చంద్రమౌళి, సహాయ అధికారిగా ఎస్‌ఎస్‌ఏ పీవో ఎం.వెంకటేశ్వరరావు.

                                                                                                         Desk :koti7123