పింఛన్ కష్టాలు మొదలయ్యాయి …

0
7
పింఛన్ కష్టాలు మొదలయ్యాయి …

న్యూస్ టుడే:ఈ నెల 2 వ తేదీ నుంచి 4 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తం గా పింఛన్ల పండగ అయ్యింది. అంతే మంగళవారం నుంచి పంపిణీ ఆగిపోయింది. సర్వర్ లు పని చేయడం లేదు. కరప మండల పరిధిలో 23 గ్రామాలు ఉండగా 3 రోజుల పాటు రోజుకి 8 గ్రామాల వంతున పింఛన్లు ఇచ్చారు. అలా 60 శాతం వరకు పూర్తి అయ్యాయి. మంగళవారం ఉదయమే ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్లారు. యధాప్రకారం పింఛన్ లబ్దిదారులు పింఛన్ల కోసం పంచాయతీ కార్యాలయంలకు చేరుకున్నారు. గతం మాదిరి గానే కార్యదర్శిలు రాకపోవడం, సిబ్బంది సర్వర్ పని చేయకపోవడం తో పాపం కార్యాలయా ల వద్ద పడిగాపులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచియున్నా , వేలిముద్రలు పడకపోవడం సిబ్బంది రాక తీవ్ర జాప్యం జరిగింది. పలు పంచాయతీ ల్లో మంచినీరు ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది. పింఛన్ కష్టాలు మొదలయ్యాయి. 3 రోజులు తమను విఐపిలు గా చూసి భోజనాలు పెట్టి స్వీట్, హాట్ ఇచ్చి ఆదరించిన వారే ఇపుడు పట్టించుకోవడం లేదంటూ లబ్ధిదారులు శాపనార్ధాలు పెడుతున్నారు.

                                                                                                             డెస్క్:డి.రాఘవ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here