రెండు రోజుల పర్యటనకు గాను నేడు ఢిల్లీకి వెళ్లనున్న జగన్……..

0
6
రెండు రోజుల పర్యటనకు గాను నేడు ఢిల్లీకి వెళ్లనున్న జగన్……..

ఆంధ్రప్రదేశ్:(టిన్యూస్10) న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • జగన్ తో పాటు వెళ్లనున్న పలువురు రాష్ట్ర మంత్రులు
  • ఈ సాయంత్రం మోదీతో భేటీ
  • రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను కూడా కలవనున్న జగన్

                      వివరాల్లోకి వెళితే…ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి పయనమవుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను చెల్లించాలని ప్రధానిని కోరనున్నారు. విద్యుత్ ఉత్పాదక సంస్థల పీపీఏలపై సమీక్ష, రివర్స్ టెండరింగ్ తదితర అంశాలను వివరించనున్నారు. ఢిల్లీ పర్యటనకు జగన్ తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, కొడాలి నానిలతో పాటు పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. మరోవైపు, కీలకమైన ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్న తరుణంలో మోదీతో జగన్ భేటీ ఉంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ముందస్తు షెడ్యూల్ ప్రకారమైతే జగన్ కు మోదీ అపాయింట్ మెంట్ లభించింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మోదీతో భేటీ కావాల్సి ఉంది.