ప్లీజ్.. నన్ను బ్యాన్ చేయండి.. కంగనా షాకింగ్ మెసేజ్!

0
6
ప్లీజ్.. నన్ను బ్యాన్ చేయండి.. కంగనా షాకింగ్ మెసేజ్!

 (టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….  

  •  తీరు మార్చుకోకపోతే బ్యాన్ చేస్తామంటూ ఎంటర్ టైన్ మెంట్ మీడియా గిల్డ్ … 
  • జర్నలిస్టుల్లో ఒకరిని ఉద్దేశించి కంగనా తీవ్ర ఆగ్రహాం… 

                      వివరాల్లోకి వెళితే….కంగనా తన తీరు మార్చుకోకపోతే ఆమెను బ్యాన్ చేస్తామంటూ ఎంటర్ టైన్ మెంట్ మీడియా గిల్డ్ సభ్యులు హెచ్చరించారు. తాజాగా ఆమె నటించిన జడ్జిమెంటల్ హై క్యా సినిమా ప్రచారంలో భాగంగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జర్నలిస్టుల్లో ఒకరిని ఉద్దేశించి కంగనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా సదరు రిపోర్టర్ కు అండగా మరికొందరు రిపోర్టర్లు చేరారు. అయినప్పటికీ ఆమె వారికి వెరవకుండా.. తప్పుడు రాతలు రాస్తారంటూ తప్పు పట్టారు.కంగనా వ్యవహరించిన తీరు ఏ మాత్రం బాగోలేదంటూ పలువురు తప్పు పడుతున్న వేళ.. జరిగిన దానికి కంగనా క్షమాపణలు చెప్పకుంటే ఆమె మీద బ్యాన్ విధిస్తామంటూ ఎంటర్ టైన్ మెంట్ మీడియా గిల్డ్ హెచ్చరించింది. అందుకు రిప్లై అన్నట్లు తాజాగా ఆమె ఒక ట్వీట్ వీడియోను పోస్ట్ చేశారు.