హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు!

0
4
హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…….

  • అల్కాపూరి సమీపంలో రాజ్ తరుణ్ కారుకు ప్రమాదం
  • వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయిన రాజ్ తరుణ్
  • నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారని ఆరోపణలు

రెండు రోజుల క్రితం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అల్కాపూరి సమీపంలో నటుడు రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, ఆ వెంటనే రాజ్ తరుణ్ అక్కడి నుంచి పరిగెత్తుతూ పారిపోయిన సంగతి తెలిసిందే. తొలుత ఈ ప్రమాదానికి కారణం మరో నటుడు తరుణ్ అన్న ప్రచారం జరిగినప్పటికీ, చివరకు కారు నడిపింది తానేనని రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు పెట్టారు. విచారణకు రావాల్సిందిగా ఆయనకు ట్విట్టర్ ద్వారా సమాచారాన్ని అందించినట్టు నార్సింగ్ పోలీసు ఇనస్పెక్టర్ రమణ గౌత్ వెల్లడించారు. ఆయనతో మాట్లాడిన తరువాత కేసు విషయంలో ముందుకెళ్లే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందున కేసు పెట్టామని అన్నారు.