బంగాళాదుంప జంతికలు..

0
6
 బంగాళాదుంప జంతికలు..
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు – రెండు
శనగపిండి – ఒక కప్పు
కారం – స్పూను
మిరియాల పొడి – పావు స్పూనుకు తక్కువగా
ఇంగువ – కొద్దిగా
నువ్వుపప్పు – స్పూనున్నర
ఉప్పు – తగినంత
నూనె – 350 గ్రాములు.
తయారుచేసే విధానం: ముందుగా బంగాళా దుంపలను పై చెక్కు తీయకుండా ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత పైచెక్కు తీసుకుని ఒక గిన్నెలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో శనగపిండి, కారం, ఉప్పు, మెత్తని మిరియాల పొడి, నువ్వుపప్పు, కొద్దిగా ఇంగువ వేసి తగినన్ని నీళ్ళు పోసుకుని జంతికలు వేసుకోవటానికి అనువుగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి మొత్తం నూనె పోసి నూనెను బాగా కాగనిచ్చి స్టౌను మీడియం సెగ పెట్టి, జంతికల గొట్టంలో ఈ పిండిని పెట్టి జంతికల్లాగా వేసుకోవాలి. బంగాళాదుంపకారణంగా తొందరగా వేగిపోతాయి. నల్లరంగు రాకుండా చూసుకుని వేయించుకోవాలి. రెండు రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి తక్కువ మోతాదులో చేసుకుంటే సరిపోతాయి.
                                                                   డెస్క్: కీర్తి & సుప్రియ & జ్యోతి 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here