పొట్టుధాన్యాల క్రాకర్స్….

0
6
 పొట్టుధాన్యాల క్రాకర్స్….

తయారీకి కావాల్సినవి :

  • గోధుమల పిండి – అర కప్పు 
  • నూనె – 2 స్పూన్స్ 
  • ఓట్స్ – అర కప్పు
  • అవిసెగింజలు – 5 స్పూన్స్
  • తెల్ల నువ్వుల గింజలు – 2 స్పూన్స్
  • ఎండుమిరపకాయల ఫ్లేక్స్ – 2 స్పూన్స్.

తయారీ విధానం : ముందుగా గోదుమ పిండిని నూనెతో కలిపి చపాతీ పిండిలా చేయాలి . విడిగా ఓట్స్, అవిసెగింజలు, తెల్లనువ్వులు, ఎండుమిరపకాయల ఫ్లేక్స్ కలిపి పొడిగా తయారు చేయాలి. ఈ పొడిని కలుపుకున్న పిండికి కలపాలి. ఒక కుకీ కట్టర్ తీసుకుని గుండ్రని ఆకారంలో కట్ చేసుకోవాలి. ఓవెన్ ను ముందుగా వేడి చేసి పెట్టుకుని 180 డిగ్రీల సెల్సియస్ వేడిలో 20 నిమిషాలపాటు కుక్ చేయాలి. బయటకు తీసిన క్రేకర్స్ ను చల్లారాక గాలి చొరబడని సీసాలో ఉంచాలి. అవసరమైనప్పుడు మాత్రమె మూత తీయాలి. పొట్టు గోదుమల పిండిలో కార్బో హైడ్రేట్లతో పాటు పీచుపదార్థంకూడా ఉంటుంది . అరుగుదల బావుంటుంది పైగా పిల్లలకు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. రెండు గ్రాముల అవిసెగింజలలో పాలీ అన్ సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, ఫిటోకెమికల్స్, అరుగుదలకు ఉపయోగపడే పీచుపదార్థాలు ఉంటాయి.                      డెస్క్ :ch. లక్ష్మీ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here