ప్రముఖ పారిశ్రామికవేత్త బి.కె.బిర్లా కన్నుమూత…

0
4
ప్రముఖ పారిశ్రామికవేత్త బి.కె.బిర్లా కన్నుమూత…

ముంబయి న్యూస్‌టుడే: ముఖ్యాశాంలు…

  • వితరణ శీలి.. విద్యాభిలాషి… 
  • బుధవారం ముంబయిలో ఆయన కన్నుమూత…

                              వివరాల్లోకి వెళితే…బిర్లా టెంపుల్‌ గురించి వినని వారుండరు. విద్యాసంస్థల్లో బిట్స్‌ పిలానీ పేరు కూడా సుపరిచితమే. అన్నిటికీ మించి అప్పుడు, ఇప్పుడు భారత్‌ అంటే గుర్తుకొచ్చేది టాటాలు.. బిర్లాలే. ఆ బిర్లాలలో ఒక అరుదైన వ్యక్తే బసంత్‌ కుమార్‌ బిర్లా.98 ఏళ్ల వయసులో బుధవారం ముంబయిలో ఆయన కన్నుమూశారు.దేశవ్యాప్తంగా ఉన్న 25 విద్యా సంస్థలు, ఎన్నో కంపెనీలను, దాతృత్వ సంస్థలను.. ముఖ్యంగా కుటుంబ సభ్యులను శోక సముద్రంలో ముంచి.. ఆయన వెళ్లిపోయారు. పారిశ్రామిక దిగ్గజం ఘన్‌శ్యామ్‌ దాస్‌ చిన్న కుమారుడు, ఆదిత్య విక్రమ్‌ తండ్రి, కుమార మంగళం బిర్లా తాతయ్య అయిన బి.కె. బిర్లా(98) బుధవారం ముంబయిలో తనువు చాలించారు. వయసు సంబంధిత అనారోగ్యాల వల్ల మరణించిన బిర్లాకు కోల్‌కతాలోని బిర్లాపార్క్‌లోని ఆయన సొంత గృహం వద్దే అంత్యక్రియలను నిర్వహించనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.తాత ఆరోగ్యం క్షీణించడంతో మనవడు కుమారమంగళం బిర్లా ఆయనను ముంబయికి తీసుకెళ్లినట్లు సమాచారం.