ప్రతిభావని……………..

0
6
ప్రతిభావని……………..

న్యూస్‌టుడే:

*ఆలిండియా స్థాయిలో 560వ ర్యాంకు.. సివిల్స్‌ ఫలితాల్లో విశాఖ జిల్లాకు చెందిన లక్ష్మీసౌజన్య 560వ ర్యాంకుతో మెరిశారు. రెండో ప్రయత్నంలోనే ఈ విజయం సాధించడం విశేషం. శృంగవరపుకోట మండలంలోని వెంకటరమణపేట సొంత గ్రామమైనప్పటికీ తండ్రి ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. స్టీల్‌ప్లాంటులో తండ్రి ఎం.వెంకటరావు ఇంజినీరుగా పనిచేస్తుండటంతో ఉక్కునగర్‌లోని డీఏవీ పాఠశాలలో 1 నుంచి పదోతరగతి వరకు చదువుకున్నారు. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ ఎంపీసీలో చేరారు. 2007 నుంచి 2011 వరకు వరంగల్‌ ఎన్‌ఐటీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్సు చేశారు. 2011 నుంచి 2015 వరకు బెంగళూరులోని ఒక కంపెనీలో ఇంజినీరుగా ఉద్యోగం చేశారు. ఎలాగైనా సివిల్స్‌ చేయాలనే తలంపుతో మంచి ప్యాకేజీతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2016లో సివిల్స్‌ శిక్షణ కోసం డిల్లీ వెళ్లిపోయారు. తొలి ప్రయత్నంలో విఫలమయ్యారు. పట్టుదలతో చదివి రెండో ప్రయత్నంలో విజయం సాధించారు.   

                                                                                                                  డెస్క్:వసుధ